'అందాల రాక్షసి' సినిమాలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి... తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. పలు సినిమాలలో నటించిన లావణ్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఆమె కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమ వివాహం చేసుకుని మెగా కోడలుగా మారిపోయింది. నవంబర్ 1న ఇటలీలో వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె చాలా హాట్ గా కనిపిస్తున్నారు. మరోవైపు ఇన్స్టాలో లావణ్య తన పేరును లావణ్య త్రిపాఠి కొణిదెలగా మార్చుకున్నారు.