మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు
- టీ వర్క్స్‌ను రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారని కాంగ్రెస్ నేత సూర్జేవాలా ఫిర్యాదు
- ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని కేటీఆర్ ఉల్లంఘించినట్లు అభిప్రాయపడిన ఈసీ
- రేపు మధ్యాహ్నం మూడు గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీ వర్క్స్ భేటీలో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారని, అలాగే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పారని, తద్వారా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్‌ను ఉపయోగించుకున్నారని సూర్జేవాలా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ... కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. రేపు మధ్యాహ్నం మూడు గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.