ఇల్లు శుభ్రంగానే ఉంది.. అయినా బొద్దింకలు వస్తున్నాయా? కారణం ఇవే కావచ్చు!
- మురికిగా ఉన్న స్పాంజ్‌లు, గుడ్డలు బొద్దింకలకు నిలయం
- స్టవ్ చుట్టూ పేరుకుపోయిన జిడ్డు వాటికి ఆహారం
- బొద్దింకలు దాక్కునేందుకు కార్డ్‌బోర్డ్ పెట్టెలు అనుకూలం
- పెంపుడు జంతువుల ఆహారాన్ని బయట ఉంచకపోతే మేలు
- బొద్దింకలను ఆకర్షించే ఖాళీ డబ్బాలు, బాటిళ్లలోని అవశేషాలు
- లీకేజీలు, తడి ప్రదేశాలు బొద్దింకల పెరుగుదలకు అనుకూలం
వంటగదిని రోజూ శుభ్రం చేస్తుంటారు. మిగిలిపోయిన ఆహారాన్ని వెంటనే పడేస్తారు. అయినా బొద్దింకలు మాత్రం తగ్గవు. దీంతో ‘ఇంత శుభ్రంగా ఉంచుతున్నా ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి?’ అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి వాటిని ఆకర్షించేది మిగిలిపోయిన ఆహారం మాత్రమే కాదు. మనం పెద్దగా పట్టించుకోని కొన్ని వస్తువులు, అలవాట్లు కూడా వాటికి ఆశ్రయం, ఆహారం, నీటిని అందిస్తుంటాయి. అందుకే వంటగదిలో ఉండే ఈ ఏడు విషయాలపై తప్పకుండా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
తడి స్పాంజ్‌లు
పాత్రలు కడిగే స్పాంజ్‌లు, వంటగది గుడ్డలు ఎక్కువసేపు తడిగానే ఉంటాయి. వాటిలో చిన్నచిన్న ఆహార అవశేషాలు పేరుకుపోతుంటాయి. ఇలాంటి తేమ ఉన్న ప్రదేశాలు బొద్దింకలకు అనుకూలంగా మారతాయి. కాబట్టి స్పాంజ్‌లను ఉపయోగించిన తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలి. వంటగది గుడ్డలను తరచూ వేడి నీటితో ఉతకాలి. పాత స్పాంజ్‌లను ఎప్పటికప్పుడు మార్చడం మంచిది.
స్టవ్ చుట్టూ జిడ్డు
చాలామంది నేలపై పడిన ఆహారాన్ని మాత్రమే శుభ్రం చేస్తారు. కానీ స్టవ్, ఎగ్జాస్ట్ హుడ్, క్యాబినెట్లు, హ్యాండిల్స్‌పై పేరుకుపోయే జిడ్డును పెద్దగా పట్టించుకోరు. ఇది బొద్దింకలకు ఆహారంగా మారతుంది. అందుకే వంట చేసే ప్రదేశాలను పూర్తిగా శుభ్రం చేయాలి.
కార్డ్‌బోర్డ్ పెట్టెల్లో..
బొద్దింకలకు ఆహారం ఎంత అవసరమో.. దాక్కునేందుకు సురక్షితమైన ప్రదేశం కూడా అంతే అవసరం. కార్డ్‌బోర్డ్ పెట్టెలు, పేపర్ బ్యాగులు, పాత వార్తాపత్రికల మధ్య అవి సులభంగా దాక్కుంటాయి. అంతేకాదు, కార్డ్‌బోర్డ్ తేమను పీల్చుకోవడం వల్ల అవి మరింత అనుకూలంగా మారుతాయి. కాబట్టి ఆహార పదార్థాలను కార్డ్‌బోర్డ్‌లో కాకుండా గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ చేయడం మంచిది.
పెంపుడు జంతువుల ఆహారం
ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటి కోసం పెట్టిన ఆహారాన్ని రాత్రంతా అలాగే ఉంచొద్దు. మిగిలిపోయిన ఆహారం, చిన్న ముక్కలు కూడా బొద్దింకలను ఆకర్షిస్తాయి. రోజూ ఆహార పాత్రలను శుభ్రం చేయడం, పెట్ ఫుడ్‌ను మూత ఉన్న డబ్బాల్లో నిల్వ చేయడం అవసరం.
ఖాళీ బాటిళ్లు, డబ్బాలు
ఖాళీ కూల్‌డ్రింక్ డబ్బాలు, జ్యూస్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లలో మిగిలిపోయిన చక్కెర అవశేషాలు బొద్దింకలకు ఆహారంగా మారతాయి. రీసైక్లింగ్ బిన్‌లో వేసే ముందు వాటిని నీటితో కడగడం మంచిది. ఇంట్లో చెత్త ఎక్కువసేపు నిల్వ ఉంచకుండా తరచూ బయట వేయాలి.
లీకేజీలు.. బొద్దింకలకు నీటి వనరు
బొద్దింకలు ఆహారం లేక కొంతకాలం బతకగలవు. కానీ నీరు లేక ఎక్కువకాలం జీవించలేవు. అందుకే లీకవుతున్న పైపులు, చుక్కలు పడే ట్యాప్‌లు, తడి క్యాబినెట్లు, ఫ్రిజ్ చుట్టూ పేరుకుపోయే తేమ వాటికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇంట్లో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలి.
చిన్న జాగ్రత్తలు
బొద్దింకలను పూర్తిగా దూరంగా ఉంచాలంటే కేవలం పురుగుమందులు వాడటం సరిపోదు. వంటగదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. తేమ పేరుకుపోకుండా చూసుకోవాలి. ఆహారాన్ని మూత ఉన్న డబ్బాల్లో నిల్వ చేయాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఈ చిన్న అలవాట్లే వాటి బెడదను గణనీయంగా తగ్గిస్తాయి. పరిశుభ్రమైన వంటగది.. ఆరోగ్యకరమైన ఇంటికి తొలి అడుగు అని గుర్తుంచుకోవాలి.