దుబ్బాకలో పవన్ కల్యాణ్ ప్రచారం.... సీఎం.. సీఎం అంటూ యువత నినాదాలు

Pawan Kalyan campaign in Dubbaka
  • తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రఘునందన్ రావును గెలిపించాలని విజ్ఞప్తి
  • బీజేపీ అభ్యర్థులను గెలిపించి బీసీని సీఎంగా చేసుకోవాలని పిలుపు
  • బీజేపీకి ఓటు వేసి ఉపాధి కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న పవన్ కల్యాణ్
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రఘునందన్ రావున మరోసారి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని దుబ్బాక ప్రజలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. గురువారం ఆయన చేగుంటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారానే అభివృద్ధి జరుగుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత బీజేపీకి ఓటు వేసి ఉపాధి కల్పించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. కలిసికట్టుగా పని చేసి వకీల్‌సాబ్‌ను అసెంబ్లీకి పంపించాలన్నారు.

సీఎం సీఎం అంటూ నినాదాలు...


పవన్ కల్యాణ్ ఈ రోజు కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తెలంగాణ యువత 'సీఎం.. సీఎం' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సూర్యాపేటలో ఆయన వాహనం పైనుంచి మాట్లాడుతున్న సమయంలో పెద్ద ఎత్తున 'ముఖ్యమంత్రి' అంటూ నినాదాలు చేశారు. 
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
BJP
Raghunandan Rao
Dubbaka
Telangana
Telangana Assembly Election

More Telugu News