ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు.. గందరగోళంలో బీజేపీ, జనసేన
- తెలంగాణలో ఉమ్మడిగా పోటీ చేస్తున్న బీజేపీ జనసేన
- ఇండిపెండెంట్లకు జనసేన గ్లాసు గుర్తును కేటాయించిన అధికారులు
- ఓటర్లు తికమక పడతారనే ఆందోళనలో ఇరు పార్టీల నేతలు
గ్లాసు గుర్తును చూసి జనసేనగా భావించి పలువురు ఓటర్లు ఓటు వేసే అవకాశం ఉందని ఇరు పార్టీల నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. దీంతో, ఓటర్లకు అర్థమయ్యేలా గుర్తు గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని కూడా ఇదే సమస్య వెంటాడుతోంది. కారు గుర్తును పోలిన రోడ్ రోలర్, రోటీ మేకర్ వంటి గుర్తులు గులాబీ పార్టీని కలవరపెడుతున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.