వరుణ్-లావణ్య వివాహం.. క్లీంకారతో చిరంజీవి దంపతుల ఫొటో వైరల్
- ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి వరుణ్, లావణ్యల వివాహం
- పెళ్లిలో చిరు, అల్లు కుటుంబాల సందడి
- మనవరాలు క్లీంకారను మురిపెంగా చూస్తున్న చిరంజీవి దంపతుల ఫొటో వైరల్
అయితే, మనవరాలు క్లీంకారతో చిరంజీవి దంపతులు దిగిన ఫొటో ప్రస్తుతం మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో చిరంజీవి అర్ధాంగి సురేఖ క్లీంకారను ఎత్తుకోగా చిరంజీవి మురిపెంగా చిన్నారివైపు చూస్తున్న వైనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. నెటిజన్లు ఈ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు.
ఇక కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్యలకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరి రిసెప్షన్ ఈ నెల 5న మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తారు.