సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు
- 14.30 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉండవల్లి నివాసానికి
- ఉదయం 5.45 గంటలకు ఇంటికి చేరుకున్న చంద్రబాబు
- రోడ్డు పొడవునా టీడీపీ శ్రేణుల ఘనస్వాగతాలు
చంద్రబాబు నివాసానికి అమరావతి రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉండవల్లి నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టి తీసి అమరావతి మహిళలు నీరాజనాలు పట్టారు. స్వాగత కార్యక్రమాల్లో నాయకులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుండగా చంద్రబాబు నాయుడికి దారిపొడవునా కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టాయి. అర్థరాత్రి వేళ, తెల్లవారుజామున సైతం వేలసంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు.