ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదు

ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదు

TDP complains center on sand mining in AP
  • ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న టీడీపీ
  • సీబీఐ, సీవీసీలకు టీడీపీ ఎంపీలు కనకమేడల, రామ్మోహన్ లేఖలు
  • ప్రీ బిడ్ సమావేశాన్ని కోల్ కతాలో రహస్యంగా నిర్వహించారని వెల్లడి 
ఏపీలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న తీరును తెలుగుదేశం పార్టీ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర దర్యాప్తుల సంస్థలకు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆ మేరకు సీబీఐ, సీవీసీలకు టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు లేఖలు రాశారు. ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) నిబంధనలు పాటించడంలేదని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల బినామీలకే టెండర్లు ఇస్తున్నారని వెల్లడించారు. ప్రీ బిడ్ సమావేశాన్ని కూడా రహస్యంగా కోల్ కతాలో నిర్వహించారని వివరించారు.
Advertisement
Sand Mining
TDP
CBI
CVC
YSRCP
Andhra Pradesh

More Telugu News