టాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకున్న త్రిష .. బాలకృష్ణ సినిమాలో ఛాన్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకున్న త్రిష .. బాలకృష్ణ సినిమాలో ఛాన్స్!

Trisha Special
  • ఎంతమాత్రం గ్లామర్ తగ్గని త్రిష
  • 'లియో'లోను అందంగా మెరిసిన భామ
  • కోలీవుడ్ లో పుంజుకున్న కెరియర్  
  • బాబీ - బాలయ్య సినిమాలోను దక్కిన ఛాన్స్ 
  • ఇక తెలుగులోను బిజీ అయ్యే అవకాశం
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా త్రిష ఒకానొక సమయంలో చక్రం తిప్పేసింది. అదే సమయంలో అంతే స్టార్ స్టేటస్ ను ఆమె కోలీవుడ్ లోను చూసింది. చాలాకాలం పాటు ఆమె తన జోరును చూపించిన తరువాతనే, రెండు భాషల్లోను అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలో ఆమె తమిళంలో నాయిక ప్రధానమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లింది.

'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో ఆమె పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె గ్లామర్ రెట్టింపు కావడం చూసి అంతా షాక్ అయ్యారు. దాంతో ఆమెకి కోలీవుడ్ సీనియర్ హీరోల సరసన మళ్లీ అవకాశాలు రావడం మొదలైంది. 'లియో' ఛాన్స్ కూడా అలా వచ్చిందే. ఈ సినిమాలోనూ త్రిష చాలా అందంగా కనిపించింది. 

ఇక ఆమె టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సరసన సందడి చేయడం కూడా ఖాయమని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆమె బాలయ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను, సితార బ్యానర్ వారు నిర్మించనున్నారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
Advertisement
Trisha
Balayya
Bobby
Tollywood

More Telugu News