భారత్, పాక్ పోరు ముగిశాక నేను చేస్తున్నది ఇదే: ఆనంద్ మహీంద్రా
- వరల్డ్ కప్ ఆనవాయతీ కొనసాగించిన భారత్
- పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన రోహిత్ సేన
- తాను ప్రస్తుతం ఆనంద తాండవం చేస్తున్నానని ఆనంద్ మహీంద్రా వెల్లడి
- ఆసక్తికర వీడియో పంచుకున్న వైనం
భారత క్రీడా రంగానికి వీరాభిమాని అయిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం తాను ఆనంద తాండవం చేస్తున్నానని వెల్లడించారు. ఆ మేరకు ఓ ఆఫ్రికన్ డ్యాన్సర్ మెరుపువేగంతో సంప్రదాయ నృత్యం చేస్తున్న వీడియోను ఆయన పంచుకున్నారు. భారత్, పాక్ చారిత్రక సమరం ముగిశాక తాను చేస్తున్నది ఈ సంతోషదాయక నృత్యమేనని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.