జైల్లో ఉన్న ఖైదీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు: మంత్రి రోజా విమర్శలు

Minister Roja satires on Pawan Kalyan
  • చంద్రబాబుకు మద్దతిచ్చేవారికి వాటాలు వెళ్లి ఉంటాయన్న రోజా
  • పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసమే ప్రయత్నిస్తున్నాడని విమర్శ
  • చంద్రబాబు సంతకాలు పెట్టారని సీఐడీ చెప్పిన విషయం తెలియదా? అని ప్రశ్న
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుపై చేసిన వ్యాఖ్యల మీద మంత్రి ఆర్కే రోజా స్పందించారు. జైల్లో ఉన్న ఖైదీతో జనసేనాని పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయ్యారని, ఆయనకు మద్దతిచ్చే వారికందరికీ ఈ కేసులో వాటాలు వెళ్లి ఉంటాయని ఆరోపించారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసమే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు లేవని చెబుతున్నారని, కానీ సంతకాలు ఉన్నాయని సీఐడీ చెప్పిన విషయం పవన్ కల్యాణ్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.
Go Back to Shorts
Roja
Pawan Kalyan
Chandrababu
Telugudesam

More Telugu News