డ్వాక్రా రుణంతో వ్యాపారం.. వాట్సాప్‌తో ఇంటికే సరుకులు!

డ్వాక్రా రుణంతో వ్యాపారం.. వాట్సాప్‌తో ఇంటికే సరుకులు!

Business with DWCRA loan and groceries to doorstep via WhatsApp
  • రేపల్లెలో డ్వాక్రా మహిళ జేజమ్మతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
  • డ్వాక్రా రుణంతో కిరాణా వ్యాపారం.. వాట్సాప్‌తో ఆర్డర్ల స్వీకరణ
  • 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్' స్ఫూర్తిదాయకమన్న మహిళ
  • స్వయం ఉపాధితో మహిళలు ఎదగాలని సీఎం చంద్రబాబు పిలుపు
  • లబ్ధిదారునికి వృద్ధాప్య పింఛను అందజేసిన ముఖ్యమంత్రి
స్వయం సహాయక సంఘాల ద్వారా లభించే రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో చిరు వ్యాపారాలు ప్రారంభించి, ఆధునిక సాంకేతికతను జోడించి వాటిని విస్తరించుకోవాలని ఆయన సూచించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో నిర్వహించిన ‘పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా, రేపల్లె పట్టణంలోని 4వ వార్డులో 'శ్రీలక్ష్మి కిరాణా జనరల్ స్టోర్' యజమాని జి. జేజమ్మతో పాటు ఇతర డ్వాక్రా మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. డ్వాక్రా గ్రూప్ బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.2 లక్షల రుణం పొంది, తన కిరాణా దుకాణాన్ని విస్తరించినట్లు జేజమ్మ ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్’ నినాదం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆమె పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు సేకరించి, తన భర్త శ్రీనివాసరావు సహాయంతో నేరుగా ఇళ్లకే డెలివరీ చేస్తున్నామని తెలపడంతో చంద్రబాబు వారి పనితీరును అభినందించారు.

ఇదే క్రమంలో పలువురు డ్వాక్రా మహిళలు తమ వ్యాపార ఆలోచనలను, భవిష్యత్తు ప్రణాళికలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. వాట్సాప్ బిజినెస్‌ వినియోగంపై మహిళలకు ఉన్న అవగాహనను అడిగి తెలుసుకున్న చంద్రబాబు, నూతన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం, జేజమ్మ మామగారైన వెంకటరావుకు ముఖ్యమంత్రి స్వయంగా వృద్ధాప్య పింఛను అందజేశారు. పర్యటన ముగింపులో ఆయన డ్వాక్రా మహిళలతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.
Advertisement
Nara Chandrababu Naidu
DWCRA Loans
One Family One Entrepreneur
Bapatla District
NTR Bharosa

More Telugu News