తల్లి వర్థంతి.. బాలకృష్ణ ఎమోషనల్ పోస్ట్
- తల్లి బసవతారకం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బాలకృష్ణ
- అమ్మ చూపిన మార్గమే తన జీవితానికి శక్తి అని వెల్లడి
- బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రూపంలో ఆమె సంకల్పం నిలిచిందన్న బాలయ్య
- పేదలకు ఆసుపత్రి అందిస్తున్న సేవలే అమ్మకు నిజమైన నివాళి అని పేర్కొనడం
- భావోద్వేగపూరిత పోస్ట్ ద్వారా తన మనసులోని మాట పంచుకున్న బాలకృష్ణ
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన మాతృమూర్తి, స్వర్గీయ శ్రీమతి బసవతారకం వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ భావోద్వేగభరిత నివాళి అర్పించారు. అమ్మ భౌతికంగా తమ మధ్య లేకపోయినా, ఆమె ప్రేమ, ఆశీస్సులు ఎప్పటికీ తమతోనే ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు.
"మా అమ్మ శ్రీమతి బసవతారకం గారి వర్ధంతి సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు. అమ్మ భౌతికంగా మా మధ్య లేకపోయినా.. ఆమె ప్రేమ, ఆమె ఆశీస్సులు, ఆమె చూపిన మార్గం ఎప్పటికీ మా జీవితాల్లో సజీవంగానే ఉంటాయి. ఆమె చూపిన అపారమైన మమకారం, ఆమె పోరాటం వెనుక నిలిచిన అసాధారణ ధైర్యం, ఆమె మాకు నేర్పిన విలువలు.. నేటికీ నా జీవితాన్ని నడిపించే శక్తిగా నిలిచాయి.
ఆమె జ్ఞాపకాలను కేవలం మనసులో దాచుకోవడం మాత్రమే కాదు.. ప్రతి పేదవాడికీ, ప్రతి రోగికీ ఆశాకిరణంగా నిలుస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రూపంలో ఆమె పేరు, ఆమె సంకల్పం చిరస్థాయిగా నిలవడం, ఆమె సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం నాకు ఎంతో గర్వకారణం. ఎందరో జీవితాల్లో ఆశను నింపుతున్న ఈ సేవా ప్రయాణం ఆమె ఆశయాలకు నిజమైన నివాళిగా నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాను. అమ్మ చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను" అంటూ బాలకృష్ణ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.