చిరు వ్యాపారికి వలపు వల.. నగ్నంగా మార్చి లక్షన్నర స్వాహా
- హైదరాబాద్‌లో ఘటన
- ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన యువతి
- వీడియో కాల్‌లో నగ్నంగా మార్చి బ్లాక్‌మెయిల్
ఒకసారి వాట్సాప్‌లో వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో అతడిని నగ్నంగా మారమని కోరడంతో అతడు అదే పనిచేసి ఆమె చేతికి చిక్కాడు. ఆ వీడియోను రికార్డు చేసిన ఆమె దానిని చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను బయటపెడతానని బెదిరించింది. దీంతో తప్పని పరిస్థితుల్లో అతడు విడతల వారీగా రూ. 1.53 లక్షలు సమర్పించుకున్నాడు. అయినా, ఇంకా డబ్బుల కోసం బెదిరిస్తుండడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.