జూరాల నుంచి నీరు విడుదల.. నేడు కర్ణాటక సీఎంతో భేటీ కానున్న తెలంగాణ మంత్రులు

జూరాల నుంచి నీరు విడుదల.. నేడు కర్ణాటక సీఎంతో భేటీ కానున్న తెలంగాణ మంత్రులు

  • మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు జూరాల నుంచి నీరు విడుదల
  • కుడి, ఎడుమ కాలువలకు 350 క్యూసెక్కులు, 750 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల
  • కృష్ణా జలాల విడుదలపై డీకే శివకుమార్ తో చర్చించనున్న మంత్రులు

పాలమూరు ఆయకట్టు రైతులకూ పూర్తి ఉపశమనం కలిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు. ఇందులో భాగంగా కుడి కాలువ నుంచి 350 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 750 క్యూసెక్కుల నీటిని కాలువలకు మళ్లించారు. ప్రస్తుత పంటల సాగు అవసరాల దృష్ట్యా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.


మరోవైపు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు నేడు సమావేశం కానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని రైతులకు, ఆయకట్టుకు నిరంతరాయంగా కృష్ణా జలాలను విడుదల చేయాలని కోరుతూ నిన్న రాత్రి మంత్రుల బృందం కర్ణాటక సీఎంకు ముందస్తుగా వినతిపత్రం సమర్పించింది. నేటి భేటీలో ఎగువ ప్రాజెక్టుల నుంచి జూరాలకు నీటి ప్రవాహాలు, తాగు, సాగునీటి కేటాయింపులపై లోతుగా చర్చించే అవకాశం ఉంది.

Advertisement

More Telugu News