ఇక మైత్రీ థియేటర్లలో 'సర్వపిండి'.. సినిమా చూస్తూ కమ్మని రుచి.. 'ది ప్యారడైజ్'తో ఎంట్రీ!

ఇక మైత్రీ థియేటర్లలో 'సర్వపిండి'.. సినిమా చూస్తూ కమ్మని రుచి.. 'ది ప్యారడైజ్'తో ఎంట్రీ!

Mythri Theaters to serve Sarva Pindi during The Paradise movie screening
  • తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తున్న మైత్రీ థియేటర్స్
  • తమ థియేటర్లలో సర్వపిండి అమ్మకాలకు శ్రీకారం
  • ‘బామ్మాస్టోరిస్’ ఫేమ్ 77 ఏళ్ల బామ్మ చేతి వంట ప్రత్యేకం
  • ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రదర్శనతో ఈ కొత్త అనుభూతి ప్రారంభం
ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ’ తమ థియేటర్ల ద్వారా ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సినిమా అనుభూతికి తెలంగాణ సంస్కృతిని, అచ్చమైన పల్లె రుచులను జోడిస్తూ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ థియేటర్లలో తెలంగాణ సంప్రదాయ వంటకమైన ‘సర్వపిండి’ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

తొలి దశలో భాగంగా మైత్రీ విమల్, మైత్రీ శివగంగ థియేటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న భారీ చిత్రం ‘ది ప్యార‌డైజ్’ ప్రదర్శన సమయంలో విరామంలో ప్రేక్షకులు ఈ కమ్మని సర్వపిండిని ఆస్వాదించవచ్చు. సినిమా చూస్తూనే, తెలంగాణ ప్రత్యేక వంటకాన్ని రుచి చూసే ఈ కొత్త అనుభవం సినీ ప్రియులను ఆకట్టుకుంటుందని సంస్థ భావిస్తోంది.

ఈ సరికొత్త ఆలోచన వెనుక సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందిన ‘బామ్మాస్టోరిస్‌’కు చెందిన 77 ఏళ్ల బామ్మ కృషి ఉంది. ఓ చిన్న టిఫిన్ సెంటర్‌లో ఆమె ప్రేమతో తయారు చేసే సర్వపిండి, ఇప్పుడు ఏకంగా బిగ్ స్క్రీన్ ప్రేక్షకులకు చేరువ కావడం విశేషం. వెండితెరపై దృశ్యాలను ఆస్వాదిస్తూనే, తెలంగాణ అసలైన రుచిని అందించాలన్న మైత్రీ థియేటర్స్ ప్రయత్నంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
Mythri Movie Makers
Sarva Pindi
The Paradise Movie
Mythri Theaters
Baamma Stories
Telangana Traditional Food

More Telugu News