‘సమయం వస్తుంది.. మిమ్మల్ని వదలం’: ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఫైర్
- ‘సర్’ వివాదం నేపథ్యంలో ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- ‘ఓటు చోరీ’ రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్య
- ఇద్దరు ఈసీల అభ్యంతరాలపై మీడియాలో కథనం నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు
- 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తమైనట్లు కథనం
- ఎలాంటి అధికారిక భిన్నాభిప్రాయం లేదని ఈసీ స్పష్టీకరణ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై వివాదం కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం అధికారులు చేస్తున్నది తప్పని వ్యాఖ్యానిస్తూ.. ‘సమయం వస్తుంది.. మిమ్మల్ని వదలం’ అంటూ హెచ్చరించారు. ‘ఓటు చోరీ’ భారత ప్రజల పట్ల నేరమని, రాజ్యాంగంపై నేరుగా దాడి చేయడమేనని ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఓ వీడియోను కూడా రాహుల్ గాంధీ పంచుకున్నారు. ‘‘ఎన్నికల సంఘానికి, ఎన్నికల అధికారులకు స్పష్టంగా చెబుతున్నా.. మీరు చేస్తున్నది తప్పు. ఇది దేశద్రోహం. సమయం వస్తుంది. మిమ్మల్ని పట్టుకుంటాం. తప్పించుకోలేరు’’ అని అందులో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలకు కారణమైన వివాదం ఓ పత్రిక ప్రచురించిన పరిశోధనాత్మక కథనంతో మొదలైంది. పది నెలల వ్యవధిలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు నిర్ణయాలపై కనీసం 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. కొత్త ఓటర్ల చేర్పు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ వంటి అంశాలు అందులో ఉన్నట్లు తెలిపింది.
అయితే ఈ కథనాన్ని ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఇద్దరు కమిషనర్లు కొన్ని అంశాలపై అభిప్రాయాలు, సూచనలు మాత్రమే చేశారని.. అధికారికంగా ఎలాంటి భిన్నాభిప్రాయం నమోదు కాలేదని ఈసీ వర్గాలు తెలిపాయి. ‘సర్’ సహా అన్ని నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగానే తీసుకున్నట్లు స్పష్టం చేశాయి.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ పార్లమెంటరీ కమిటీ సమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరారు.