'ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్'.. హర్యానాలో ఫుడ్ కల్తీకి చెక్.. రూ.20కే నిమిషాల్లో టెస్ట్!
- హర్యానాలో అందుబాటులోకి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వ్యాన్లు
- కేవలం రూ.20 రుసుముతో ఆహార కల్తీ పరీక్షలు
- 10 నుంచి 12 నిమిషాల్లోనే ప్రాథమిక ఫలితాలు వెల్లడి
- ఎఫ్ఎస్ఎస్ఏఐ అందించిన ఐదు సంచార ప్రయోగశాలలతో తనిఖీలు
- ప్రజల్లో ఆహార భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యం
ఆహార కల్తీని అరికట్టేందుకు, ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించేందుకు హర్యానా ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేవలం రూ.20 నామమాత్రపు రుసుముతో, 10-12 నిమిషాల్లోనే ఆహార పదార్థాల కల్తీని ప్రాథమికంగా గుర్తించే మొబైల్ ల్యాబొరేటరీలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సంచార ప్రయోగశాలల ద్వారా ప్రజలు తాము రోజూ వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను సులభంగా, వేగంగా పరీక్షించుకునే వీలు కల్పించింది.
ఈ కార్యక్రమం కోసం భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అందించిన ఐదు మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీలను (వ్యాన్లను) రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఈ వ్యాన్లు రొటేషన్ పద్ధతిలో మార్కెట్లు, బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలలు వంటి జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సేవలు అందిస్తాయి. ప్రజలు తమ ఇళ్లలో వాడే పాలు, మసాలాలు, పప్పులు, వంట నూనెలు, ఇతర నిత్యావసర ఆహార పదార్థాల శాంపిళ్లను ఈ వ్యాన్ల వద్దకు తీసుకొచ్చి పరీక్షించుకోవచ్చు.
ఈ వ్యాన్లలో ఉండే ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికక్కడే ప్రాథమిక పరీక్షలు నిర్వహించి నిమిషాల్లోనే ఫలితాలను వెల్లడిస్తారు. అంతేకాకుండా, అధికారులు కూడా మార్కెట్లలోని దుకాణాల నుంచి అప్పుడప్పుడు శాంపిళ్లను సేకరించి తనిఖీలు చేస్తారు. ప్రాథమిక పరీక్షలో శాంపిల్ కల్తీ అయినట్లు తేలినా లేదా అనుమానాస్పదంగా కనిపించినా, దానిని పూర్తిస్థాయి విశ్లేషణ కోసం పంపి, ఆహార భద్రతా నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. సామాన్య ప్రజలకు సైతం ఆహార కల్తీ పరీక్షలను సులభంగా అందుబాటులోకి తీసుకురావడమేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుమితా మిశ్రా తెలిపారు. జాతరలు, పండుగల సమయాల్లో కల్తీని అరికట్టేందుకు ఈ వ్యాన్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె వివరించారు. కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా ఆహార భద్రత, ప్యాకెట్లపై ఉండే న్యూట్రిషన్ లేబుల్స్, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా ఈ మొబైల్ యూనిట్లు నిర్వహిస్తాయని ఆమె పేర్కొన్నారు.