రాయలసీమకు లక్ష కోట్ల వరం.. అక్టోబర్ 2న హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన
- లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆరు జిల్లాల్లో ప్రాజెక్టు అమలు
- నిర్మలా సీతారామన్‌తో కలిసి ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- రిలయన్స్ ఏర్పాటు చేయనున్న అగ్రికల్చర్ స్కూల్‌కు కూడా అంకురార్పణ
- వరుస కార్యక్రమాలతో ఐదు రోజుల పాటు సీఎం చంద్రబాబు బిజీ బిజీ
దశాబ్దాలుగా కరవుతో అల్లాడుతున్న రాయలసీమ రూపురేఖలను మార్చే బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సుమారు లక్ష కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 2వ తేదీన మదనపల్లెలో జరిగే కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా సీమ రైతాంగ భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్ర ప్రభుత్వ ‘పూర్వోదయ’ పథకం కింద ఈ రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు అందనుండగా, మరో రూ.60 వేల కోట్లను ప్రైవేటు పెట్టుబడుల ద్వారా సమీకరించనున్నారు. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు.
ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి నీరందిస్తూనే, మరోవైపు ఉద్యానవన పంటలను ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాంతాల్లో సంపద సృష్టించి, రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ హబ్ ప్రధాన ఉద్దేశం. ఇదే కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు.
వరుస కార్యక్రమాలతో సీఎం బిజీ
ఈ నెల 29వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఐదు రోజుల పాటు సీఎం చంద్రబాబు పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటూ తీరిక లేకుండా గడపనున్నారు.
సెప్టెంబర్ 29: ఉదయం విజయవాడలో జరిగే DOPT కర్మయోగి మిషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నిర్వహించే ‘పల్లె పండుగ’కు హాజరవుతారు.
సెప్టెంబర్ 30: విజయవాడలో 24 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
అక్టోబర్ 1: రాష్ట్రవ్యాప్తంగా జరిగే ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు.
అక్టోబర్ 2: గాంధీ జయంతి సందర్భంగా ఉదయం మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, అనంతరం విజయవాడలో జరిగే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు.
అక్టోబర్ 3: విజయవాడలో జరిగే పాన్ ఐఐటీ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ వరుస కార్యక్రమాలతో సీఎం ఐదు రోజుల పాటు ప్రజలతో మమేకం కానున్నారు.