అమృత్ భారత్ స్టేషన్ స్కీం.. ఏపీలో ఆధునికీకరించే రైల్వే స్టేషన్ల తొలి జాబితా
- మారనున్న పదకొండు స్టేషన్ల రూపురేఖలు
- ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పన
- విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ వెల్లడి
ఏపీలో తొలివిడతలో ఎంపికైన రైల్వే స్టేషన్ల జాబితాను విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపురం, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని రైల్వే స్టేషన్లను ఆధునికీకరించనున్నట్లు వివరించారు. ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన వసతులను కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.