11 మంది మహిళలు కలిసి లాటరీ టిక్కెట్ కొంటే రూ.10 కోట్ల గెలుపు

11 Women Pooled Money To Buy 250 Lottery Ticket They Won 10 Crore
  • కేరళ హరిత కర్మ సేనలో పనిచేస్తున్న మహిళలు
  • కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన లాటరీలో మాన్‌సూన్ బంపర్ ఆఫర్ గెలుపు
  • తమ ఆర్థిక కష్టాలు తీరుతాయని మహిళల హర్షం
కేరళకు చెందిన పదకొండు మంది మహిళలను అదృష్టం అనూహ్యంగా వరించింది. రాత్రికి రాత్రే వారందరూ లక్షాధికారులైపోయారు. రూ.250ల లాటరీ టిక్కెట్టును 11 మంది కలిసి మరీ కొనుక్కుని చివరకు రూ.10 కోట్లు గెలుచుకున్నారు. 

పరప్పనన్‌గడీ మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేనకు చెందిన ఈ మహిళలు స్థానికంగా నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలిస్తుంటారు. అలా వచ్చే కొద్ది పాటి ఆదాయమే వారి జీవనాధారం, వారి కుటుంబాలకున్న ఏకైక ఆదాయ వనరు. 

ఇటీవల టిక్కెట్టు కొనుక్కునే సమయానికి వారి వద్ద కనీసం పాతిక రూపాయలు కూడా లేని పరిస్థితి. దీంతో, కొందరు అప్పు చేసి మరీ మొత్తం రూ.250తో ఓ లాటరీ టిక్కెట్టు కొనుక్కున్నారు. బుధవారం కేరళ లాటరీ డిపార్టుమెంటు లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మాన‌సూన్ బంపర్ లాటరీ దక్కింది. దీంతో, ఆ మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నామని, ఈ డబ్బుతో కొంతమేర సమస్యలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు. రాత్రికిరాత్రి లక్షాధికారులైన వీరికి బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
Advertisement
Kerala Lottery

More Telugu News