అది డైమండ్ రింగ్ కాదు.. బాటిల్ ఓపెనర్‌‌ అంటూ అసలు విషయాన్ని చెప్పిన తమన్నా

Tamannaah Bhatia breaks silence over diamond ring
  • డైమండ్‌ రింగ్‌ ధరించిన తమన్నా ఫొటోలు వైరల్‌
  • రూ. 2 కోట్ల విలువైన ఆ రింగ్‌ను ఉపాసన గిఫ్ట్‌ గా ఇచ్చినట్టు వార్తలు
  • బాటిల్‌ ఓపెనర్‌‌ ఫొటో షూట్‌ చేసినట్టు వెల్లడించిన హీరోయిన్‌
టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన తమన్నా భాటియా కొన్నాళ్లుగా సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్య వెబ్ సిరీస్‌లో బోల్డ్‌ క్యారెక్టర్స్ చేయడం ప్రారంభించిన తమన్నా నటుడు విజయ్ వర్మతో తన ప్రేమ గురించి వెల్లడించింది. ఇప్పుడు తను మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి విజయ్‌తో డేటింగ్ పుకార్ల గురించి కాదు. ప్రపంచంలో ఐదో అతి పెద్ద వజ్రం పొదిగిన ఉంగరంతో ధరించిన తమన్నా ఫొటోలు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  

దీని విలువ రూ. 2 కోట్లు అని, ఈ డైమండ్ రింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల నుంచి ఆమెకు బహుమతిగా లభించిందని ఆ వార్త సారాంశం. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డిలో అద్భుతంగా నటించినందుకు తమన్నాకు ఉపాసన ఈ రింగ్‌ ను బహుమతిగా ఇచ్చిందంటూ నెట్‌లో చర్చ మొదలైంది. అయితే, ఈ వార్తలను తమన్నా ఖండించింది. అది డైమండ్ రింగ్ కాదని, ఓ బాటిల్ ఓపెనర్‌‌తో ఫొటో షూట్‌ చేసినట్టు ఇన్‌ స్టా గ్రామ్‌ స్టోరీ ద్వారా వెల్లడించింది.
.
Advertisement
Tamannaah
upasana
diamond ring

More Telugu News