ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు సత్తా చాటుతున్నారు: బాలకృష్ణ
- అమెరికాలో జరిగిన తానా సభల్లో ప్రసంగించిన హీరో
- ఎన్టీఆర్ కు నివాళులు అర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం
- నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ
అమెరికాలోని పెన్సిల్వేనియాలో తానా మహాసభలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు తలపెట్టిన ఈ సభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సభలలో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.