ఏపీలో యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది: వైఎస్ జగన్

YS Jagan Mohan Reddy says youth anger in Andhra Pradesh is overflowing
  • విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
  • అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలన్న వైసీపీ
  • జిల్లా కేంద్రాల్లో వైసీపీ విద్యార్థి, యువజన విభాగాల నిరసనలు
  • ప్రభుత్వం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని జగన్ ఆరోపణ
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అన్యాయం యువతలో తీవ్ర ఆగ్రహాన్ని, నిరాశను రేకెత్తించాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు.

వైసీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత, ప్రజలతో కలిసి జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని జగన్ తెలిపారు. డీఎస్సీ అక్రమాలకు పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువత బలంగా డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ నుంచి స్పోర్ట్స్ కోటా నియామకాల వరకు జరిగిన ప్రతి అక్రమంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కోరారు.

చంద్రబాబు ప్రభుత్వం లీకులు, అక్రమాలతో ప్రతిభావంతులైన యువత భవిష్యత్తును అంధకారం చేసిందని, వారిని రోడ్డున పడేసిందని జగన్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, మంత్రి లోకేశ్ గానీ నోరు మెదపకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.                                
Advertisement
YS Jagan Mohan Reddy
DSC Paper Leak
Nara Lokesh
Andhra Pradesh Youth Protest
Chandrababu Naidu
YSRCP Protests

More Telugu News