వివాహితపై జూబ్లీహిల్స్ సీఐ అఘాయిత్యం, ఆపై బ్లాక్‌మెయిల్.. వెలుగులోకి దారుణ ఘటన
- జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిపై వివాహిత లైంగిక దాడి ఆరోపణలు
- వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి రూ.2 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదు
- బలవంతంగా అబార్షన్ చేయించారని ఆరోపణ
- సీఐని వీఆర్‌కు అటాచ్ చేసిన ఉన్నతాధికారులు
- ఉన్నతస్థాయి విచారణకు డీజీపీ ఆదేశం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) శ్రీనివాసులు రెడ్డిపై ఓ వివాహిత తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై లైంగిక దాడికి పాల్పడి, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపిస్తూ ఆమె నేరుగా డీజీపీ సీవీ ఆనంద్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల్లోనే ఉన్నతాధికారులు స్పందించి, శ్రీనివాసులు రెడ్డిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ బదిలీ చేశారు.
బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీనివాసులు రెడ్డి గతంలో అమీన్‌పూర్ సీఐగా ఉన్నప్పుడు కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళ వెళ్లారు. ఆ సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడిన సీఐ ఆ దారుణాన్ని వీడియో తీశారని ఆమె ఆరోపించారు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని తరచూ అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, తన నుంచి సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారని పేర్కొన్నారు. దీనికి ఆధారంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల వివరాలను కూడా జతచేశారు. ఈ క్రమంలో తాను గర్భం దాల్చితే, బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ కూడా చేయించారని వాపోయారు.
హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు తాను చాలాసార్లు ప్రయత్నించగా.. అక్కడి అధికారులు తనను సీపీని కలవనీయకుండా అడ్డుకున్నారని కూడా ఆమె ఆరోపించారు.
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన డీజీపీ సీవీ ఆనంద్, ఈ కేసు విచారణ బాధ్యతను మల్టీజోన్ ఐజీ షానవాజ్ ఖాసీంకు అప్పగించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేయాలని వెస్ట్ జోన్ డీసీపీని ఆదేశించారు. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే సీపీ సజ్జనార్ ఏడుగురు సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శ్రీనివాసులు రెడ్డిని జూబ్లీహిల్స్ నుంచి వీఆర్‌కు పంపించి, ఆయన స్థానంలో రాజేంద్రనగర్ సీఐ ముత్తు యాదవ్‌ను నియమించారు.