మాట నిలబెట్టుకున్న కేటీఆర్
- నానమ్మ జ్ఞాపకార్థం ఆమె సొంతూరిలో పాఠశాల భవనం నిర్మాణం
- సొంత ఖర్చులతో భారీ భవనం నిర్మాణం పూర్తి
- దీన్ని చూసి తన నానమ్మ తప్పకుండా సంతోషిస్తుందని కేటీఆర్ ట్వీట్
గతేడాది కోనాపూర్ కు వచ్చిన కేటీఆర్ నానమ్మ జ్ఞాపకార్థం గ్రామంలో పాఠశాల నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఏడాది తిరిగేలోపే భవనం సిద్ధం అవగా.. వారం రోజుల్లో తన తల్లి శోభమ్మతో కలిసి పాఠశాలను కేటీఆర్ ప్రారంభిస్తారని స్థానిక నాయకులు చెబుతున్నారు.