రూ.1.83 లక్షలకే హోండా కొత్త అడ్వెంచర్‌ బైక్‌.. ఫీచర్లు ఇవే!

రూ.1.83 లక్షలకే హోండా కొత్త అడ్వెంచర్‌ బైక్‌.. ఫీచర్లు ఇవే!

Honda New Adventure Bike for Just Rs 183 Lakh Features Details
  • హోండా ఎక్స్‌ఆర్‌300ఎల్‌, ఎక్స్‌ఆర్‌300 ర్యాలీ విడుదల
  • ఎక్స్‌ఆర్‌300ఎల్‌ ధర రూ.1.83 లక్షలు
  • ఎక్స్‌ఆర్‌300 ర్యాలీ ధర రూ.2.08 లక్షలు
  • రెండు బైక్‌లలో 286 సీసీ ఇంజిన్‌
  • ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌ కోసం ప్రత్యేకంగా రూపకల్పన
భారత్‌లో అడ్వెంచర్‌ బైక్‌లకు డిమాండ్‌ పెరుగుతున్న వేళ హోండా రెండు కొత్త బైక్‌లను తీసుకొచ్చింది. ఎక్స్‌ఆర్‌300ఎల్‌, ఎక్స్‌ఆర్‌300 ర్యాలీ పేరుతో వచ్చిన ఈ బైక్‌లు రోజువారీ ప్రయాణాలతో పాటు ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌, లాంగ్‌ టూర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ముఖ్యంగా తక్కువ బరువు, ఆఫ్‌రోడ్‌ సామర్థ్యం, ధర విషయంలో ఇవి ఈ విభాగంలో ఉన్న పలు మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

హోండా ఎక్స్‌ఆర్‌300ఎల్‌ ధర రూ.1.83 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. ఎక్స్‌ఆర్‌300 ర్యాలీ ధర రూ.2.08 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. ఈ రెండు బైక్‌లలో ఒకే ప్లాట్‌ఫామ్‌, ఇంజిన్‌ ఇచ్చారు. అయితే వీటి ఉపయోగం మాత్రం కొంత భిన్నంగా ఉంటుంది.

ఎక్స్‌ఆర్‌300ఎల్‌ను ప్రధానంగా ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌ కోసం రూపొందించారు. ఎక్స్‌ఆర్‌300 ర్యాలీలో పెద్ద ఫ్రంట్‌ ఫెయిరింగ్‌, పొడవైన విండ్‌స్క్రీన్‌, అదనపు బాడీ వర్క్‌ ఉన్నాయి. ఇవి సుదూర ప్రయాణాల్లో రైడర్‌కు మరింత సౌకర్యం అందించేలా ఉంటాయి.

ఈ రెండు బైక్‌లలో 286 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది సుమారు 24.3 హెచ్‌పీ పవర్‌, 26.5 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పనితీరు పరంగా ఇవి హోండా ఎక్స్‌పల్స్‌ 210, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ మధ్యలో నిలుస్తాయి.

బైక్‌లలో అప్‌సైడ్‌ డౌన్‌ ఫ్రంట్‌ ఫోర్కులు, రియర్‌ మోనోషాక్‌, ముందు వెనుక డిస్క్‌ బ్రేకులు, వైర్‌-స్పోక్‌ వీల్స్‌, డ్యూయల్‌ పర్పస్‌ టైర్లు ఉన్నాయి. పొడవైన సస్పెన్షన్‌ ట్రావెల్‌ ఆఫ్‌రోడ్‌ రైడింగ్‌కు ఉపయోగపడుతుంది.

ధర, బరువు, ఆఫ్‌రోడ్‌ సామర్థ్యాల కలయికతో ఎక్స్‌ఆర్‌300ఎల్‌, ఎక్స్‌ఆర్‌300 ర్యాలీ మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇవి కవాసాకి కేఎల్‌ఎక్స్‌ 230, హీరో ఎక్స్‌పల్స్‌ 210, కేటీఎం అడ్వెంచర్‌ 250, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ వంటి బైక్‌లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.
Advertisement
Honda XR300L
Honda XR300 Rally
Adventure Bikes India
Honda New Bike Launch
Off Road Motorcycles
Honda XR300L Price Features

More Telugu News