మంత్రి లోకేశ్ ను కలిసిన ఆసియా క్రీడల స్వర్ణ విజేత ఆర్చర్ జ్యోతి సురేఖ

మంత్రి లోకేశ్ ను కలిసిన ఆసియా క్రీడల స్వర్ణ విజేత ఆర్చర్ జ్యోతి సురేఖ

Asian Games Gold Medalist Archer Jyothi Surekha meets Minister Lokesh
  • ఏషియన్ గేమ్స్-2026లో స్వర్ణం సాధించిన సురేఖను అభినందించిన లోకేశ్
  • 2028 ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచన
  • ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ
  • ఏషియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు 6 పతకాలు సాధించిన సురేఖ
అంతర్జాతీయ వేదికలపై పతకాల పంట పండిస్తూ దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్న ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సోమవారం రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయింది. ఇటీవల జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్-2026లో స్వర్ణ పతకం సాధించిన ఆమెను మంత్రి లోకేశ్ ఘనంగా అభినందించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశిస్తూ, 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సోమవారం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది. తన తండ్రి సురేంద్ర కుమార్‌తో కలిసి జ్యోతి సురేఖ, మంత్రి లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా, జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్-2026 ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న జ్యోతి సురేఖను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించడం గర్వంగా ఉందని కొనియాడారు.

ఏషియన్ గేమ్స్ చరిత్రలో జ్యోతి సురేఖ ఇప్పటివరకు నాలుగు స్వర్ణ పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలు సాధించి అరుదైన రికార్డు సృష్టించింది. ఆమె నిలకడైన ప్రతిభ, పట్టుదల యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని లోకేశ్ అన్నారు. ఈ ప్రయాణంలో ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.
Advertisement
Vennam Jyothi Surekha
Nara Lokesh
Asian Games 2026
Archery Gold Medalist
Andhra Pradesh Government
2028 Olympics

More Telugu News