‘మా అనుమతి లేదు’.. ఫారమ్‌-6పై సుప్రీంకోర్టు షాకింగ్‌ కామెంట్స్‌

‘మా అనుమతి లేదు’.. ఫారమ్‌-6పై సుప్రీంకోర్టు షాకింగ్‌ కామెంట్స్‌

Supreme Court says no permission given for revised Form 6 voter registration
  • ఫారమ్‌-6 మార్పులకు అనుమతి ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ
  • మార్పు ఎవరు చేశారో తెలుసుకుంటామన్న సీజేఐ
  • రికార్డులు చూశాకే పూర్తిస్థాయి విచారణ ఉంటుందని వెల్లడి
  • ఫారమ్‌-6ను సవరించలేదని ఈసీ స్పష్టీకరణ
  • ‘సర్‌’ కోసం అదనపు డిక్లరేషన్‌ మాత్రమే చేర్చామని వెల్లడి
కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉపయోగించే ఫారమ్‌-6లో చేసిన మార్పులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సవరించిన ఫారమ్‌-6కు తాము అనుమతి ఇవ్వలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు.

ఫారమ్‌-6లో అసలు మార్పు జరిగిందా? జరిగితే ఎవరు చేశారు? అనే విషయాలను తేల్చాల్సి ఉందని కోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన రికార్డులు తమ ముందుకు వచ్చిన తర్వాతే అంశాన్ని లోతుగా పరిశీలిస్తామని సీజేఐ చెప్పారు. ‘‘సవరించిన ఫారమ్‌-6ను మేం ఆమోదించలేదు. ఇది స్పష్టం’’ అని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు.

అయితే ఫారమ్‌-6ను సవరించలేదని ఎన్నికల సంఘం చెబుతోంది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్‌) కోసం కొత్త ఓటర్లకు అదనపు డిక్లరేషన్‌ మాత్రమే జత చేశామని వివరిస్తోంది. ఈ అదనపు ప్రకటనను జులైలో చేర్చారు. ఇందులో తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మల పాత ఓటరు జాబితా వివరాలను అనుసంధానించాల్సి ఉంటుంది.

ఫారమ్‌-6 రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎలక్టర్స్‌ రూల్స్‌-1960లో భాగం. ఈ నిబంధనల్లో మార్పులు చేయాలంటే అధికారికంగా సవరణ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 29న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాకేత్‌ గోఖలే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఫారమ్‌-6 మార్పులకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదని న్యాయశాఖ ఆర్టీఐ సమాధానంలో చెప్పినట్లు ఆయన తెలిపారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఒంటరిగానే నిర్ణయాలు తీసుకున్నారా? అనే అంశంపైనా సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. గత 10 నెలల్లో ‘సర్‌’కు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఇటీవల ఓ కథనం వెలువడిన విషయం తెలిసిందే.
Advertisement
Supreme Court
Form 6 voter registration
Election Commission of India
Justice Surya Kant
Saket Gokhale
Voter list amendment

More Telugu News