ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం

4 dead in road accident held in Adilabad dist
  • గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద ఘటన
  • ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
  • మరికొందరికి గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుడిహత్నూరు మండలం మేకలదండి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడినట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను, మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Road Accident
Adilabad District
Auto
Telangana

More Telugu News