క్లీంకార కొణిదెల... మనవరాలి పేరు వెల్లడించిన చిరంజీవి
- రామ్ చరణ్-ఉపాసన దంపతుల కుమార్తెకు నేడు బారసాల
- ఉయ్యాలలో వేసి నామకరణం
- క్లీంకార అంటే అర్థం చెప్పిన చిరంజీవి
దీనికి సంబంధించిన వివరాలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పాప పేరు క్లీంకార కొణిదెల అని వెల్లడించారు. ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నామని తెలిపారు.
మానవుడిలో ఆధ్యాత్మికతను మేల్కొలిపే స్వచ్ఛమైన శక్తి పరివర్తనను క్లీంకార అనే పేరు సూచిస్తుందని చిరంజీవి వివరించారు. ఈ పేరులోని లక్షణాలను తమ చిన్నారి ఎదిగేకొద్దీ తన వ్యక్తిత్వంలో కచ్చితంగా ప్రతిబింబిస్తుందని నమ్ముతున్నామని పేర్కొన్నారు.