‘అగ్నివీర్’లకు శుభవార్త.. రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్
- రైల్వేలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 15 శాతం రిజర్వేషన్
- వయో పరిమితిలోనూ సడలింపు
- దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు
- అగ్నివీర్లకు రిజర్వేషన్ యోచనలో ఆర్పీఎఫ్
అగ్నివీర్ తొలి బ్యాచ్ వారికి ఐదు సంవత్సరాలు, తర్వాత బ్యాచ్‌ల నుంచి మూడేళ్ల చొప్పున వయోపరిమితిపై సడలింపు లభిస్తుంది. అయితే, నాలుగేళ్లు అగ్నివీర్లుగా ఉన్న వారికే ఈ సడలింపు లభించనుంది. అలాగే, ఆర్పీఎఫ్ కూడా అగ్నివీర్ల కోసం రిజర్వేషన్ కల్పించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.