అందం త్రిష సొంతం .. 'లేటెస్ట్ పిక్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందం త్రిష సొంతం .. 'లేటెస్ట్ పిక్స్!

Trisha Special
  • ప్రత్యేకమైన ఆకర్షణ పేరే త్రిష
  • 20 ఏళ్లకి పైగా సాగిన కెరియర్ 
  • వయసుతో పాటు పెరుగుతున్న గ్లామర్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ 
ఏ భాషకి చెందిన సినిమా ఇండస్ట్రీలోనైనా హీరోయిన్స్ తెరపై సందడి చేసేది .. స్టార్ డమ్ తో వెలిగేది కొంతకాలమే. అందువల్లనే ఆ తక్కువ సమయంలోనే వీలైనన్ని భాషల్లో ..  సాధ్యమైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తుంటారు. అయితే కొంతమంది కథానాయికలకు మాత్రమే ఎక్కువ కాలం తెరపై మెరిసే అవకాశం .. అదృష్టం లభిస్తాయి. అలాంటి వారి జాబితాలో త్రిష ఒకరు.త్రిష ఎంట్రీ ఇచ్చేటప్పటికీ తెలుగు .. తమిళ భాషల్లో గట్టి పోటీ ఉంది. అయినా ఆమె ఆ పోటీని తట్టుకుని నిలబడింది. తన ప్రత్యేకతను చాటుకుంటూ ఈ రెండు భాషల్లోను స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అవకాశాలు తగ్గినప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, తన గ్లామర్ కాపాడుకుంటూ 20 ఏళ్లకి పైగా కెరియర్ ను చూసింది. 'పొన్నియిన్ సెల్వన్ 1' సినిమాలో గ్లామర్ విషయంలో ఐశ్వర్యరాయ్ ముందు తేలిపోకుండా త్రిష నిలబడగలిగింది. గతంలో కంటే ఆమె అందంగా కనిపించడం చూసి టాలీవుడ్ ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఆ గ్లామర్ కారణంగానే ఇప్పుడు మరోసారి విజయ్ జోడీగా 'లియో' చేస్తోంది. తెలుగు సీనియర్ హీరోల జోడీగా కూడా ముందుగా ఆమెనే అడుగుతున్నారు. లేటెస్ట్ గా వదిలిన ఆమె ఫొటోలు చూస్తుంటే, మరికొంత కాలంపాటు త్రిష జోరు కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనిపిస్తోంది.
Advertisement
Trisha
Actress
Tollywood

More Telugu News