గుడివాడలో కొడాలి నాని కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- గుడివాడలో నేడు చంద్రబాబు పర్యటన
- రోడ్ షో, సభలో పాల్గొననున్న టీడీపీ అధినేత
- కొడాలి నాని కార్యాలయం వద్దకు చేరుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు
- గుడివాడకు భారీగా పోలీసు బలగాల తరలింపు
కొడాలి నాని కార్యాలయం వద్దకు వైసీపీ, టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇరు పార్టీల వర్గీయులు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో, పోలీసు బలగాలను పెద్ద సంఖ్యలో గుడివాడకు తరలించారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు పోలీసులను బృందాలుగా విభజించి రూట్లు నిర్దేశిస్తున్నారు.