19 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న యాక్సెంచర్
- ఖర్చులు తగ్గించుకునేందుకే కోతలన్న కంపెనీ
- 18 నెలలపాటు లే ఆఫ్‌లు కొనసాగుతాయని వెల్లడి
- తొలగింపునకు గురయ్యే ఉద్యోగులకు ప్యాకేజీ కోసం 1.2 బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయింపు
ఖర్చుల నియంత్రణ నేపథ్యంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నామని, వచ్చే 18 నెలలపాటు ఇవి కొనసాగుతాయని యాక్సెంచర్ పేర్కొంది. తొలగింపునకు గురయ్యే ఉద్యోగుల కోసం ప్యాకేజీ అందించేందుకు 1.2 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించింది. కాగా, వృద్ధి రేటు ఈ ఏడాది 8 నుంచి 11 శాతం వరకు ఉంటుందని గతంలో అంచనా వేసిన సంస్థ.. ప్రస్తుత పరిస్థితుల్లో అది 10 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉందని భావిస్తోంది.