ఉత్తరాఖండ్ లో మరో రెండు నగరాల్లోనూ ఇళ్లకు పగుళ్లు
- జోషిమఠ్ లో భూమి కుంగుబాటు.. ఇళ్లకు పగుళ్లు
- ఇప్పుడు రుద్రప్రయాగ్, కర్ణప్రయాగ్ నగరాల్లోనూ అదే పరిస్థితి
- ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్న ప్రజలు
ఇప్పటికే ఆ రెండు నగరాల్లో కొన్ని కట్టడాలు కూలిపోయినట్టు తెలిసింది. దాంతో ప్రజలు భయాందోళనలకు గురవుతూ, ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. రిషికేశ్-కర్ణప్రయాగ్ నగరాల మధ్య రైలు మార్గంలో ఓ భారీ టన్నెల్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ టన్నెల్ నిర్మాణం కోసం కొండరాళ్లను పేల్చివేస్తున్నారు. కర్ణప్రయాగ్, రుద్రప్రయాగ్ నగరాల్లో ఇళ్ల పగుళ్లకు ఈ పేలుళ్లే కారణమని భావిస్తున్నారు.