బాలయ్య సరసన 'టాక్సీవాలా' హీరోయిన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలయ్య సరసన 'టాక్సీవాలా' హీరోయిన్!

Anil Ravipudi Upcoming Movie
  • 'టాక్సీవాలా'తో హిట్ అందుకున్న ప్రియాంక జవాల్కర్
  • 'ఎస్. ఆర్. కల్యాణ మంటపం'తోను మంచి గుర్తింపు 
  • కొంతకాలంగా అవకాశాల వేటలో ఉన్న బ్యూటీ 
  • అనిల్ రావిపూడి ఎంపిక చేసినట్టుగా ప్రచారం   
బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి ఒక సినిమా చేయనున్నాడు. కెరియర్ పరంగా బాలయ్యకి ఇది 108వ సినిమా. ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో అనిల్ రావిపూడి ఉన్నాడు. ఇది తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన కథ అనీ, కూతురుగా శ్రీలీల చేయనుందని ఆయన చెప్పాడు. 

దాంతో మరి బాలయ్య సరసన ఆడిపాడేదెవరు? అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అనిల్ రావిపూడి సినిమాలైన 'రాజా ది గ్రేట్' .. 'ఎఫ్ 2' .. 'ఎఫ్ 3' సినిమాలు చేసిన మెహ్రీన్ .. ఈ సినిమాలో హీరోయిన్ గా చేయవచ్చనే ప్రచారం జరిగింది. 

కానీ ఇప్పుడు ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక జవాల్కర్ ను ఎంపిక చేసినట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. 'టాక్సీవాలా' .. 'ఎస్. ఆర్. కల్యాణ మంటపం' సినిమాలతో విజయాలను అందుకున్న ప్రియాంక చేతిలో ప్రస్తుతం ప్రాజెక్టులేం లేవు. ఆమెను బాలయ్య జోడీగా తీసుకున్నారని సమాచారం. మరోపక్క, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న 'వీరసింహా రెడ్డి' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Balakrishna
Priyanka Jawalkar
Anil Ravipudi

More Telugu News