Chiranjeevi: 'గాడ్ ఫాదర్ 2' పై మనసులో మాట చెప్పిన డైరెక్టర్ మోహన్ రాజా

Mohan Raja Interview
షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన 'గాడ్ ఫాదర్' ఈ నెల 5వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఎన్వీ ప్రసాద్ - ఆర్.బి. చౌదరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో మోహన్ రాజా టీమ్ తో చర్చా కార్యక్రమం కొనసాగింది. మోహన్ రాజా మాట్లాడుతూ .. " ఒక సినిమా మొదలు పెడితే ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఛాలెంజింగ్ గా తీసుకుంటూ ముందుకు వెళ్లడం నేర్చుకున్నాను" అని అన్నారు. 

కథను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ట్రెండ్ పోయింది ఇప్పుడు. కథను ఎలా చెబుతున్నామనేదే ముఖ్యమైపోయింది. కథను ఇంట్రెస్టింగ్ గా చెబితేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. కథలో నుంచి ప్రేక్షకులు ఏ మాత్రం జారిపోకుండా చూసుకోవాలి. లేదంటే వెంటనే వాళ్లు నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్లిపోతున్నారు. అందువల్లనే వాళ్లని ఎంటర్టైన్ చేసే విషయంలో మైక్రో సెకన్స్ గ్యాప్ కూడా రాకుండా చూసుకోవాలి. అందువల్లనే చివరి నిమిషం వరకూ కొత్తదనం కోసం పోరాడుతూనే ఉంటాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో భయమే జయం అన్నట్టుగా పనిచేయకపోతే కష్టమే. ఏ సినిమాకి ఆ సినిమానే లైఫ్ అనేట్టుగా నా వర్కింగ్ స్టైల్ ఉంటుంది" అని చెప్పారు.  

'లూసిఫర్' సినిమాను రీమేక్ చేయడం ఒక బాధ్యతతో కూడుకున్న పని. పైగా ఆ రీమేకును మెగాస్టార్ తో చేస్తున్నాం .. ఇది ఇంకా బాధ్యతతో కూడుకున్న పని. అందువలన ఈ రెండు విషయాలను ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ముందుకు వెళ్లడం జరిగింది. చిరంజీవి గారు మాస్ యాక్షన్ తో కూడిన పాత్రలను చేయడంలో మాస్టర్. ఆ తరహా సినిమాలను ఆయనతో చేయాలని ఉంది. అందుకు సంబంధించిన కొన్ని ఐడియాస్ నా దగ్గరున్నాయి. అలాగే 'గాడ్ ఫాదర్' తో మన టీమ్ పై మేకర్స్ కి ఒక నమ్మకం కుదిరింది కనుక, 'గాడ్ ఫాదర్ 2 కూడా చేసే అవకాశం త్వరలోనే లభిస్తుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
Chiranjeevi
Salman Khan
Nayanatara
Mohan Raja
God Father Movie

More Telugu News