Dangeti Jahnavi: ఔత్సాహిక వ్యోమ‌గామి జాహ్నవికి ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం.. రూ.50 ల‌క్ష‌ల ఆర్ధిక సాయం అందజేత

ap government handed over 50 lack rupees cheque to dangeti hagnavi
షార్ట్స్‌లో చూడండి
ఔత్సాహిక వ్యోమ‌గామి దంగేటి జాహ్న‌వికి ఏపీ ప్ర‌భుత్వం భారీ ప్రోత్సాహ‌కాన్ని అందించింది. వ్యోమ‌గామి కావాల‌న్న జాహ్న‌వి క‌ల సాకారం అయ్యే దిశ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమెకు రూ.50 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు రూ.50 ల‌క్ష‌ల చెక్కును జాహ్న‌వికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్ర‌సాద‌రాజులు బుధ‌వారం అంద‌జేశారు. త‌న క‌ల సాకారం అయ్యే దిశ‌గా ఈ మేర ఆర్థిక సాయం చేసిన సీఎం జ‌గ‌న్‌కు జాహ్న‌వి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

ఏపీలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లుకు చెందిన జాహ్న‌వి ప్ర‌స్తుతం ఇంజినీరింగ్ చ‌దువుతోంది. ఓ వైపు ఇంజినీరింగ్ చ‌దువుతూనే అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ నాసా నిర్వ‌హించిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని రికార్డు నెల‌కొల్పింది. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న తొలి భార‌తీయురాలిగానే కాకుండా తొలి ఆసియా ఖండ వాసిగా కూడా జాహ్న‌వి రికార్డు సృష్టించింది. ఈ క్ర‌మంలో తాను వ్యోమ‌గామి కావాల‌న్న సంక‌ల్పంతో సాగుతున్న జాహ్న‌వికి ఏపీ ప్ర‌భుత్వం భారీ ప్రోత్సాహ‌కం అందించింది.
Go Back to Shorts
Dangeti Jahnavi
Austronaut
NASA
Andhra Pradesh
YSRCP
Chelluboina Venugopala Krishna

More Telugu News