వైసీపీలో కీలక మార్పులు.. పలువురికి కొత్త బాధ్యతలు అప్పగించిన జగన్
- వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తల పదవుల్లో మార్పులు
- వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డిలకు కీలక బాధ్యతలు
- రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా బీరక సురేంద్రబాబు
- డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా పోరాట కమిటీ ఏర్పాటు
- న్యాయ పోరాటం కోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ నియామకం
వైసీపీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలువురు నేతలకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా ప్రాంతీయ సమన్వయకర్తల (రీజనల్ కోఆర్డినేటర్ల) నియామకాల్లో ఈ మార్పులు జరిగాయి.
తాజా మార్పుల ప్రకారం.. ఎంపీ వై.వి. సుబ్బారెడ్డిని ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించారు. గతంలో ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల బాధ్యతలను పర్యవేక్షించేవారు. మరో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం జిల్లాల సమన్వయ బాధ్యతలను అప్పగించారు. ఇక మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఉమ్మడి నెల్లూరు జిల్లా బాధ్యతలకు పరిమితం చేశారు.
ఇదే క్రమంలో బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన బీరక సురేంద్రబాబును రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించారు. వీటితో పాటు డీఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న అభ్యర్థులకు అండగా నిలిచేందుకు ఒక పోరాట కమిటీని, న్యాయపోరాటం కోసం లీగల్ సెల్‌ను కూడా జగన్ ఏర్పాటు చేశారు.
డీఎస్సీ పోరాట కమిటీలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తమడం కల్పలత, పానుగంటి చైతన్య, రవిచంద్ర ఉండగా.. లీగల్ సెల్‌లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మలసాని మనోహర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జీవీఎస్ కిషోర్‌లను సభ్యులుగా నియమించారు.