కోహ్లీ భార్య అనుష్కపై షోయబ్ అఖ్తర్ ప్రశంసలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోహ్లీ భార్య అనుష్కపై షోయబ్ అఖ్తర్ ప్రశంసలు

Shoaib Akhtar praises Virat Kohli
  • ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన కోహ్లీ
  • భార్య అనుష్క, కుమార్తె వామికకు సెంచరీని అంకితమిచ్చిన వైనం
  • అనుష్క ఒక ఐరన్ లేడీ అని ప్రశంసించిన షోయబ్
ఆసియకప్ లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత కోహ్లీ శతకాన్ని బాదాడు. ఈ సెంచరీని కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ, కుమార్తె వామికకు అంకితమిచ్చాడు. తన విజయం వెనుక అనుష్క కూడా ఉందని చెప్పాడు. 

కోహ్లీ కామెంట్స్ పై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ స్పందించాడు. అనుష్క శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. అనుష్క ఒక ఐరన్ లేడీ అని... కోహ్లీ ఉక్కు కండరాలతో తయారైన ఐరన్ మ్యాన్ అని కితాబునిచ్చాడు. కోహ్లీ ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి అని అన్నాడు. జీవితంలో కోహ్లీ మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో కోహ్లీ గొప్ప క్రికెటర్ గా నిలిచిపోతాడని అన్నాడు.
Virat Kohli
Anushka Sharma
Team India
Pakistan
Bollywood
Shoaib Akhtar

More Telugu News