TDP: టీడీపీ వెబ్‌సైట్స్ జాబితాను వెల్లడిస్తూ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ట్వీట్‌

ysrcp mla gopireddy tweet on tdp websites
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీల మధ్య సోష‌ల్ మీడియాలో ఓ రేంజిలో యుద్ధం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ త‌ర‌ఫున ప‌నిచేస్తున్న వెబ్ సైట్ల జాబితా ఇదేనంటూ వైసీపీ నేత‌, ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి బుధ‌వారం ఓ ఆస‌క్తికర ట్వీట్ చేశారు. టీడీపీ కోసం న‌డుస్తున్న వైబ్ సైట్లు ఇవేనంటూ ఆయ‌న త‌న ట్వీట్‌లో జాబితాను కూడా విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం

టీడీపీ కోసం ప‌నిచేస్తున్న ఈ వెబ్ సైట్ల‌న్నీ ఒకే ఐపీ అడ్రెస్ నుంచి న‌డుస్తున్నాయ‌ని గోపిరెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సైట్ల‌న్నీ కూడా టీడీపీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త రాబిన్ శ‌ర్మ పేరిటే రిజిస్ట‌ర్ అయి ఉన్నాయ‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఈ వెబ్ సైట్ల జాబితాతో కూడిన త‌న ట్వీట్‌కు అరెస్ట్ రాబిన్ శ‌ర్మ‌, ఫ్ర‌స్ట్రేటెడ్ టీడీపీ పేరిట హ్యాష్ ట్యాగ్‌ల‌ను కూడా గోపిరెడ్డి జ‌త చేశారు.
Go Back to Shorts
TDP
YSRCP
Srinivasa Reddy Gopireddy
Narasaraopet MLA
Robin Sharma

More Telugu News