Nagarjuna: ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఆదరించి హిట్ చేస్తారో తెలియడంలేదు: నాగార్జున

Nagarjuna opines on hits and failures
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన 'ఘోస్ట్' చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులో నాగార్జున 'విక్రమ్' అనే ఇంటర్ పోల్ అధికారిగా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ, ప్రేక్షకులు ఎప్పుడు ఏ సినిమాను ఆదరిస్తారన్న విషయం తెలియడంలేదని అన్నారు. తనకే కాదని, ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తాను దర్శకుడు రాజమౌళితో చర్చించానని, అందుకు ఆయన... ఆ సినిమాపై ముందు మనకి నమ్మకం ఉండాలని చెప్పారని, అప్పుడే ప్రేక్షకులకు కూడా నచ్చేలా తీయగలమని చెప్పారని నాగార్జున వివరించారు. 

వినోదం విషయంలో ప్రేక్షకుల నాడి పట్టుకోగలిగితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నెంబర్ వన్ గానే ఉంటారని నాగ్ చమత్కరించారు. ప్రేక్షకుల ఇష్టాయిష్టాలపై ఓ అంచనా ఉండి ఉంటే తన కెరీర్ లో అన్నీ శివ, అన్నమయ్య వంటి హిట్లే ఉండేవని అన్నారు. రామ్ గోపాల్ వర్మతో 'శివ' తీస్తే హిట్టయిందని, కానీ ఆయనతోనే తీసిన 'ఆఫీసర్' ను ప్రేక్షకులు ఆదరించలేదని తెలిపారు. కృష్ణవంశీతో తీసిన 'నిన్నే పెళ్లాడతా' చిత్రం బాగా ఆడిందని, ఆ తర్వాత ఆయనతోనే తీసిన 'చంద్రలేఖ' బోల్తా కొట్టిందని నాగ్ వివరించారు.
Go Back to Shorts
Nagarjuna
Hit
Failure
Audience
Tollywood

More Telugu News