ప్రధాని మోదీ అసభ్యకర చిత్రం.. బెంగాలీ నటి శ్రీలేఖపై పోలీసులకు ఫిర్యాదు
- మోదీ అసభ్యకర చిత్రంతో వివాదంలో బెంగాలీ నటి
- నటి శ్రీలేఖ మిత్రపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
- నీట్ నిరసనలో అభ్యంతరకర పోస్టర్‌ను ప్రదర్శించారని ఆరోపణ
- కళ్లజోడు లేనందున పోస్టర్‌ను గమనించలేదన్న నటి శ్రీలేఖ
- నటిని అరెస్ట్ చేయాలని బీజేపీ నేతల డిమాండ్
ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన అసభ్యకరమైన ఫొటో ఉన్న పోస్టర్‌ను ప్రదర్శించారన్న ఆరోపణలపై ఆమెపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలయ్యాయి. బీజేపీ నాయకురాలు కీయా ఘోష్ ఆదివారం కోల్‌కతాలోని ఆనందపూర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీలేఖపై ఫిర్యాదు చేశారు. దీనితో పాటు బిధానగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సహా పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు నమోదైనట్లు తెలుస్తోంది.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 24న కోల్‌కతాలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె చేతిలో ప్రధాని అభ్యంతరకర చిత్రం ఉన్న పోస్టర్ పట్టుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఆధారంగానే ఆమెపై ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఈ వివాదంపై శ్రీలేఖ మిత్ర స్పందించారు. తాను బీజేపీ వ్యతిరేకిని కావొచ్చు కానీ, తనను దేశద్రోహి అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. "నిరసనకు వెళ్లినప్పుడు కళ్లజోడు మర్చిపోయాను. నా దగ్గర సన్‌గ్లాసెస్ మాత్రమే ఉన్నాయి. జనసమూహం, పోలీసుల లాఠీఛార్జ్ గందరగోళంలో పోస్టర్‌పై ఉన్న చిత్రాన్ని సరిగ్గా గమనించలేకపోయాను" అని వివరణ ఇచ్చారు.
మరోవైపు బీజేపీ నాయకురాలు కీయా ఘోష్ మాట్లాడుతూ, దేశ ప్రధాని ఫొటోను అలా చూపించడం పట్ల ఒక పౌరురాలిగా ఆగ్రహం కలుగుతోందన్నారు. చట్టప్రకారం శ్రీలేఖపై కఠిన చర్యలు తీసుకుని, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, ప్రాథమిక విచారణ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని పోలీసు వర్గాలు తెలిపాయి.