హీరోయిన్ సాయిపల్లవిపై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి: రాజాసింగ్
- కశ్మీరీ పండిట్ల ఊచకోతపై సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
- కశ్మీర్ కు వెళ్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయన్న రాజాసింగ్
- సాయిపల్లవిని అరెస్ట్ చేయాలని డిమాండ్
తాము పాప్యులర్ కావాలని, తమ సినిమా పాప్యులర్ కావాలని కొందరు నటీనటులు, దర్శకులు వ్యవహరిస్తుంటారని అన్నారు. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయిపల్లవి మైండ్ పాడయిందని వ్యాఖ్యానించారు. ముస్లింల పైన, క్రిస్టియన్స్ పైన కామెంట్ చేసే దమ్ము మీకుందా? అని ఆయన ప్రశ్నించారు. ఏమీ చేయరు కదా అని హిందువులపై కామెంట్లు చేస్తే సహించబోమని చెప్పారు. సాయి పల్లవిని అరెస్ట్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.