'శేఖర్' చిత్రం ప్రదర్శనలు నిలిపివేత... ఎందుకంటే...!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'శేఖర్' చిత్రం ప్రదర్శనలు నిలిపివేత... ఎందుకంటే...!

Court orders to stop screening Shekar movie
  • రాజశేఖర్ హీరోగా శేఖర్
  • ఈ నెల 20న రిలీజ్
  • దర్శకత్వం వహించిన జీవిత
  • చిత్ర నిర్మాణంలో పాలుపంచున్న రాజశేఖర్ కుమార్తెలు
  • కోర్టును ఆశ్రయించిన ఫైనాన్షియర్
  • కోర్టు పేర్కొన్న సమయంలోగా డబ్బు చెల్లించలేకపోయిన జీవిత
రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, శేఖర్ సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలేం జరిగిందంటే... జీవితతో ఆర్థిక అంశాలపై వివాదం నేపథ్యంలో ఫైనాన్షియర్ పరంధామరెడ్డి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తీసుకున్న అప్పును జీవిత చెల్లించలేదని కోర్టులో పిటిషన్ వేశారు. 

దీనిపై విచారణ జరిపిన కోర్టు... నిర్దేశిత సమయంలోపు జీవిత డబ్బు చెల్లించాలని పేర్కొంది. అయితే, కోర్టు పేర్కొన్న సమయానికి జీవిత డబ్బు చెల్లించడంలో విఫలమయ్యారు. దాంతో, చిత్ర ప్రదర్శనలు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తాను నటించిన శేఖర్ చిత్రం ఆగిపోవడానికి కొందరు కుట్రలకు పాల్పడడమే కారణమని హీరో రాజశేఖర్ ఆరోపించడం తెలిసిందే.
Shekar
Screening
Court
Jeevitha
Rajasekhar
Financiar

More Telugu News