అబ్బే.. రాహుల్, ప్రియాంకపై అసంతృప్తి లేదు.. సమస్యల్లా అదొక్కటే: హార్దిక్ పటేల్
- ఇటీవల కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న హార్దిక్ పటేల్
- బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు
- కొట్టి పడేసిన గుజరాత్ కాంగ్రెస్ నేత
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై తనకు ఏమాత్రం అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ఉన్నదల్లా రాష్ట్ర నాయకత్వంపైనేనని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో బలమైన, నిబద్ధత కలిగిన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్నానని, రాష్ట్ర నాయకత్వంతో తనకున్న ఏకైక సమస్య అదేనని వివరించారు. కాంగ్రెస్ ఓ కుటుంబం లాంటిదన్న హార్దిక్.. ఇక్కడ ఎవరైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చని అన్నారు.