వైసీపీతో సహజీవనం చేస్తున్న బీజేపీ మధ్యలో పవన్ కల్యాణ్ కు రోడ్ మ్యాప్ ఎందుకిస్తుందో!: సీపీఐ నారాయణ
- వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చనన్న పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా
- వైసీపీ, బీజేపీ సహజీవనం చేస్తున్నాయి
- కమ్యూనిస్టుల బలం చాలా తగ్గిపోయిందన్న నారాయణ
బీజేపీ విషయంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు నోరెత్తకపోవడం బాధాకరమని నారాయణ అన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీలో భరతనాట్యం చేస్తూ, ఏపీకొచ్చి శివతాండవం చేస్తారని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల బలం చాలా తగ్గిపోయిందని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు తమ వద్దకు వచ్చేవని... ఇప్పుడు బలం తగ్గడం వల్ల ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.