Raja Singh: ఆవు మాంసం తినేవారు నాపై కుట్ర చేస్తున్నారు: రాజాసింగ్

Raja Singh response after CEC notice
షార్ట్స్‌లో చూడండి
యూపీలో యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయని వారి ఇళ్లపైకి జేసీబీలను, బుల్డోజర్లను పంపిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాజాసింగ్ కు ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. 24 గంటల్లో సమాధానం చెప్పాలని డెడ్ లైన్ విధించింది.

ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందిస్తూ... కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తన ఆఫీసుకు నోటీసులు వచ్చినట్టు ఇప్పుడే తెలిసిందని అన్నారు. గతంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉన్న సమయంలో యూపీలో ఎన్నో అరాచకాలు జరిగాయని... ఆ అరాచకాలను వివరించే ప్రయత్నమే తాను చేశానని చెప్పారు. ఆవు మాంసం తినేవారు తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోసారి రావాలని హోమం నిర్వహించేందుకు ఉజ్జయిని వెళ్తున్నానని చెప్పారు. ఈసీ ఇచ్చిన నోటీసులకు తన లాయర్ ద్వారా వివరణ ఇస్తానని తెలిపారు.
Go Back to Shorts
Raja Singh
BJP
CEC
Yogi Adityanath

More Telugu News