న‌టన‌కు గుడ్ బై.. టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న‌టన‌కు గుడ్ బై.. టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం

rahul ramakrishna says good bye to movies
  • అర్జున్ రెడ్డి, గీత గోవిందం,  జాతి ర‌త్నాలు సినిమాల్లో న‌టించిన రాహుల్
  • క‌డుపుబ్బా న‌వ్వించే డైలాగులతో మంచి పేరు
  • 2022 సినిమాల్లో త‌న చివ‌రి సంవ‌త్సరం అని ప్ర‌క‌ట‌న‌
  • జోకు చేయ‌డం లేదు క‌దా? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు  
అర్జున్ రెడ్డి, గీత గోవిందం, క‌ల్కి, జాతి ర‌త్నాలు వంటి సినిమాల్లో తనదైన శైలి నటనతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. సినిమాల్లో ఎన్నో అవ‌కాశాలు అందుకుంటోన్న ఆయ‌న ఈ స‌మ‌యంలో న‌టన‌కు
గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యం తీసుకుని అంద‌రికీ షాక్ ఇచ్చాడు.

2022 త‌న చివ‌రి సంవ‌త్సరం అని, ఆ త‌ర్వాత సినిమాలు చేయ‌న‌ని చెప్పాడు. న‌ట‌న‌కు పూర్తిగా దూర‌మవుతున్న‌ట్టు ట్విట్ట‌ర్‌లో ఆయ‌న చేసిన పోస్ట్ చూసిన అభిమానులు ఇటువంటి నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నావ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కామెడీ చేయ‌డం లేదు క‌దా? అని సెటైర్లు వేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగానే ఇటువంటి ట్వీట్ చేశాడ‌ని కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

గతంలోనూ కొంద‌రు న‌టులు ఇలాగే సినిమాల‌కు దూరమ‌వుతామ‌ని అబ‌ద్ధాలు చెప్పార‌ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా, రాహుల్ రామ‌కృష్ణ 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో విజ‌య్ దేవ‌రకొండ స్నేహితుడిగా అద్భుతంగా న‌టించాడు. అనంతరం పలు సినిమాల్లో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఆయ‌న న‌టించిన‌ ఆర్ఆర్ఆర్, విరాటప‌ర్వం సినిమాలు త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతున్నాయి.
rahul ramakrishna
Tollywood

More Telugu News